ప్రతిష్టాత్మక ఫలితాలకు వేదిక.... విజయానికి చిరునామా.....
ATP సాయిగంగ కోచింగ్ సెంటర్*
2005 సం.లో ప్రారంభించబడి నేటి వరకు అత్యద్భుత ఫలితాలను సాధిస్తూ విద్యార్థుల మనసుల్లో మరియు ఉద్యోగార్థుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది మన సాయిగంగ కోచింగ్ సెంటర్.
2005 సం.నుండి ప్రతి సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు పాలిటెక్నిక్, APRJC, RDTCET కోచింగ్ లతోపాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు DIETCET కోచింగ్ ను ఇస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్న సాయిగంగ 2012 సంవత్సరంలో TET ఎగ్జామ్ తో DSC శిక్షణారంగంలోకి అడుగుపెట్టి 2012 డీఎస్సీలో 53 మందికి గాను 36 ఉద్యోగాలతో, 2014 డీఎస్సీలో 106 మందికి గాను 83 ఉద్యోగాలను సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సాయిగంగ 2018 TET & DSC సమయానికల్లా మహావృక్షంగా ఎదిగి 2018 DSC లో 267 ఉద్యోగాలతో పాటు జిల్లా టాప్ 10 లో 7 ర్యాంకులు సాధించడం జరిగింది.
ఈ విజయోత్సాహంతో 2022 జూన్ లో జరిగిన తెలంగాణ TET పేపర్-1 లో స్టేట్ 3వ ర్యాంకును, 2022 ఆగస్టులో జరిగిన ఆంధ్రప్రదేశ్ TET పేపర్- 1 లో 150 కి 150 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించడంతో పాటు 30 మంది విద్యార్థుల చేత 140+ మార్కులు, దాదాపు 363 మంది విద్యార్థుల చేత 135+ మార్కులు సాధింపజేయడం జరిగింది.
ఈ విజయ పరంపరని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రామాణికమైన స్టడీ మెటీరియల్స్ ఆవశ్యకతను గుర్తించి, నిష్ణాతులైన అధ్యాపకులచే అత్యున్నత ప్రమాణాలతో గత TET, DSC లలో అడిగిన ప్రశ్నల సరళిని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో జరగబోయే TET, DSC ప్రశ్నల సరళిని ఊహించి అత్యద్భుతంగా పుస్తకాలను రూపొందించడం జరిగింది. వీటిని తక్కువ ధరతో ఎక్కువ మంది విద్యార్థులకు అందజేసి వారి విజయంలో మేము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ ఆన్ లైన్ బుక్స్ అనే ఈ సైట్ ను రూపొందించడం జరిగింది. విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించగలరని ఆశిస్తున్నాము.